కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అని దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ప్రశ్నకు ఇంకా కొద్ది రోజులలోనే సమాధానం దొరకబోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి నాలుగు సంవత్సరాలుగా శ్రమించి, తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. మరి బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కోసం తెలుగు రాష్ట్రం తో పాటుగా భారతదేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఎంతోమంది చిక్కుముడి కి సమాధానం .. రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి పార్ట్ 2 ఏప్రిల్ 28 న ప్రపంచమంతటా విడుదలకు సిద్ధంగా ఉంది.
సుమారు కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందింపబడిన ఈ సినిమా డిమాండ్ కూడా అలాగే ఉంది. సాటిలైట్ రైట్స్ పరంగాను .. థియేట్రికల్ రైట్స్ పరంగాను .. అన్ని బాషలలో అధిక ధర వెచ్చించి డిస్ట్రిబ్యూటర్స్ మరియు ప్రముఖ మీడియా సంస్థలు కొనుగోలు చేశారు. మరి పెట్టిన పెట్టుబడిని రాబట్టాలంటే బాహుబలి 2 టిక్కెట్ ధర పెరగాల్సిందే.
అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లో ఉండాలనే ఉద్దేశంతో టిక్కెట్ ధర ను సాధారణ ధర కంటే కొంచెం పెంచే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా తమ అభిమాన కధానాయకుడి సినిమాను .. టిక్కెట్ ధర ఎంత ఉన్నా .. బ్లాక్ బాస్టర్ హిట్ చేయాలని ప్రభాస్ ఫాన్స్ అనుకుంటున్నారని సమాచారం.